Pooja Hegde | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ భామల్లో టాప్‌లో ఉంటుంది పూజాహెగ్డే. తమిళం, హిందీ, తెలుగు భాషల్లో టాప్ స్టార్లతో కలిసి నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఈ పొడుగు కాళ్ల సుందరికి తెలుగులో హిట్ పడక చాలా కాలమే అవుతుంది.
తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్. ఈ లీడింగ్ హీరో రవి నెలకుడిటి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో జెట్ స్పీడ్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత పూజా హెగ్డే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా కథనాల ప్రకారం ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అయితే రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న కారణంగా పూజాహెగ్డే తెలుగు సినిమాలకు దూరమైందని కొన్ని రోజుల క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ దుల్కర్ సల్మాన్ టీంకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో పూజా హెగ్డేను తమ టీంలోకి తీసుకుందట. ఇక ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమాతో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది.
ఇటీవలే రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో మోనికా సాంగ్‌లో మెరిసింది పూజా హెగ్డే. ఈ పాటలో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కూలీ సాంగ్ భారీ హిట్ అయింది. ఇక దుల్కర్ సల్మాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే పూజాహెగ్డేకు తెలుగులో మళ్లీ మంచి రోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్