Pooja Hegde | తెలుగుతోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ పూజాహెగ్డే. చాలాకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న పూజాహెగ్డే ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తోన్న కూలీలో మోనికా సాంగ్‌లో మెరువబోతుందని తెలిసిందే. అయితే సినిమా స్టార్లపై నెగెటివ్ పీఆర్ (ప్రచారం), సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ రావడం కొత్తేమీ కాదు.
గతేడాది తనపై జరిగిన పెయిడ్ నెగెటివ్ పీఆర్ క్యాంపెయిన్ గురించి తొలిసారి స్పందించిన పూజా హెగ్డే తనను ఎలా తీవ్రంగా ట్రోల్ చేశారో, తనను టార్గెట్ చేసినప్పుడు తనకు ఎలా అనిపించిందో ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. నెగెటివ్ పీఆర్ తనతోపాటు తన కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో చెప్పింది పూజాహెగ్డే.
నాపై నెగెటివ్ పీఆర్ మొదలైనప్పుడు ఓ విషయాన్ని చదివిన మా అమ్మ వారంతా ఎందుకిలా చెప్తున్నారు..అని అడిగింది. అయితే దాన్ని నేనొక ప్రశంసగా తీసుకుంటా. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని కిందకి తోయాలని చూస్తే.. మనం వారి కంటే పైన ఉన్నామని అర్థం. నా కంటే పైన ఉన్న వ్యక్తిని మాత్రమే నేను కిందికి లాగగలను. అందుకే అమ్మతో నేను ‘సరే అమ్మా.. వారిని అలాగే వదిలేయ్’ అని చెప్పేదాన్ని అని పూజా హెగ్డే వెల్లడించింది.
అంతేకాదు తాను కర్మ అంటే చాలా భయపడతానని చెప్పింది పూజాహెగ్డే. మనం చేసిన ఏ మంచైనా, చెడైనా.. మళ్లీ తిరిగొస్తాయన్న కర్మ సిద్దాంతాన్ని తాను బలంగా నమ్ముతానని చెప్పింది. నేను స్క్రీన్‌పై కనిపించినప్పుడు జనాలు పేపర్లు విసిరేసి నాపై చూపించే ప్రేమ ప్రత్యక్షంగా కనిపిస్తుందని.. అభిమానులు, ప్రేక్షకులు ఎయిర్‌పోర్టులో నన్ను సెల్ఫీలు అడుగుతుంటారు. వారే కల్మషం లేని నిజమైన ప్రేమ చూపించే వ్యక్తులు.. అని చెప్పింది. సోషల్ మీడియాలో కనిపించేవారంతా నిజమైన వారు కాదని.. వారంతా నకిలీ (ఫేక్) వ్యక్తులంది పూజా హెగ్డే. మీరు ఒకవేళ వారి పేర్లపై క్లిక్ చేస్తే ఆ పేర్లపై ఎలాంటి పోస్టులు కనిపించవని.. దారుణంగా ట్రోల్స్ చేసే వ్యక్తులెవరో తనకు తెలియదన్నది పూజాహెగ్డే. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
Param Sundari Trailer | జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ట్రైలర్ చూశారా.!
Coolie Movie | రజినీకాంత్ ‘కూలీ’ క్రేజ్: ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించిన సింగపూర్ కంపెనీ
Coolie Pre Sales | రజనీ మేనియా.. విడుదలకు ముందే ‘కూలీ’ రికార్డు