Janhvi Kapoor | బాలీవుడ్ యువ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’ (Param Sundari). ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తుండగా.. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పంజాబీ, మలయాళీ ప్రేమకథాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి. ఈ చిత్రంలో సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.