Coolie movie | తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడి సినిమా వస్తుందంటే చాలు వరల్డ్ వైడ్‌గా ఉన్న అతడి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే ఆయన నటించిన తాజా చిత్రం ‘కూలీ’ విడుదల సందర్భంగా సింగపూర్‌లోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు పెయిడ్ హాలిడే (వేతనంతో కూడిన సెలవు) ప్రకటించడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కూలీ సినిమా ఆగష్టు 14న విడుదలవుతున్న సందర్భంగా.. సింగపూర్‌లోని ఫార్మర్స్ కన్స్టక్షన్స్ పీటీఈ లిమిటెడ్ (Farmer construction pte ltd careers) అనే సంస్థ తమ తమిళ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సెలవు మంజూరు చేసింది. అంతేగాకుండా.. సినిమా మొదటి రోజు ఫస్ట్ షో టికెట్లతో పాటు, ఆహారం, పానీయాల ఖర్చుల కోసం 30 సింగపూర్ డాలర్లను కూడా అందిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల సంక్షేమం, ఒత్తిడి నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, భారతదేశంలోని రజినీ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
This not Tamilnadu or India . A company in Singapore 🇸🇬 declaring holiday for #Coolie
🔥🔥🔥🔥🔥🔥
#Coolie | #CoolieThePowerHouse | #CoolieFromAug14 | #5दशक_से_सुपरस्टार | #CoolieBookings pic.twitter.com/1DNDuUgonO
— Suresh Balaji (@surbalu) August 11, 2025