Coolie | సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం కూలీ(Coolie Movie). అగ్ర నటులు నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాతో పాటు ఓవర్సీస్ అంతటా మొదలైన విషయం తెలిసిందే. తాజాగా నార్త్ అమెరికాలో క్రేజీ రికార్డును అందుకుంది ఈ చిత్రం. విడుదలకు ఇంకా రెండు రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్ సేల్స్‌తోనే రెండు మిలియన్ల క్లబ్లో చేరిపోయింది. దీంతో నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌తోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది.
#Coolie varraan solliko!😉 #Coolie is the First Tamil film to cross $2 million in premiere pre-sales in North America 🤩#Coolie releasing worldwide August 14th@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir… pic.twitter.com/Vccw6V0hQs
— Sun Pictures (@sunpictures) August 12, 2025