తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది పూజాహెగ్డే (Pooja Hegde). ఈ భామ చేతిలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeyudu Bhagath Singh) సినిమాతోపాటు త్రివిక్రమ్-మహేశ్ సినిమా కూడా ఉంది. అయితే పవన్-హరీష్ శంకర్ ప్రాజెక్టు వాయిదా పడ్డదన్న వార్త చాలా మందిని డైలామాలో పేడసిందన్న గాసిప్ ఇపుడు టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ న్యూస్ ఒకరిని మాత్రం అయోమయంలోకి నెట్టేసిందని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. తాజాగా తెరపైకి వచ్చిన అప్డేట్స్ ప్రకారం పూజాహెగ్డే ఈ సినిమాకు ఆగస్టు నెల మొత్తం కేటాయించిందట. అయితే షూటింగ్ సడెన్గా వాయిదా పడటంతో పూజాహెగ్డే కన్ఫ్యూజన్లో పడిపోయినట్టు జోరుగా టాక్ వినిపిస్తోంది. సినిమా వాయిదా పడటంతో ముందుగా కేటాయించిన డేట్స్ ను ఎలా సర్దుబాటు చేసుకోవాలో పూజాహెగ్డేకు తెలియడం లేదట.
ఇప్పటికే ఇతర సినిమాలు సెట్స్ పైకి వెళ్లిపోయిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఆగస్టు డేట్స్ ను పూజాహెగ్డే ఏ ప్రాజెక్టుకు కేటాయిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Read Also : Prithviraj Sukumaran | సలార్ స్క్రిప్ట్ అద్బుతం..తెలుగులో ఇంట్రెస్టింగ్ ఆఫర్లొస్తున్నాయి : పృథ్విరాజ్