Kamakshi Bhaskarla | పొలిమేర ప్రాంఛైజీతో నటిగా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది హైదరాబాదీ భామ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla). విరూపాక్ష, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ‘సైతాన్’ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ యాక్టింగ్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న రోల్స్ చేసేందుకు రెడీ అంటోన్న ఈ భామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ బ్యూటీ ఖాతాలో మూడు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి అల్లరి నరేశ్‌తో కలిసి 12A రైల్వే కాలనీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తోంది.కాగా నవీన్ చంద్రతో కూడా సినిమా చేస్తుండగా.. ఇటీవలే సినిమా పూర్తయింది. కాగా ఈ బ్యూటీ మరోసారి ప్రేక్షకులను థ్రిల్ కలిగించే పొలిమేర మూడో పార్ట్‌లో కూడా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఒకేసారి వరుస సినిమాలకు షూటింగ్ చేయడం కష్టమైనప్పటికీ, ఆ పని పట్ల ఉన్న మక్కువే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే సినిమా సెట్స్‌లో సమయం గడపడం ఎవరికి ఇష్టం ఉండదు.. అంటూ చెప్పుకొచ్చింది కామాక్షి భాస్కర్ల. నేను మూడు సినిమాల్లో నటిస్తున్నా.. మూడు కూడా విభిన్న పాత్రలే. చాలెంజింగ్‌గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. ప్రతీ పాత్ర ఒక కొత్త ప్రయాణం.. అని నేను నమ్ముతానంటూ చెప్పుకొచ్చింది కామాక్షి భాస్కర్ల.
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!