నవీన్‌చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. సంజీవ్ మేగోటి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది. “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
కర్మ సిద్ధాంతాన్ని హారర్ థ్రిల్లర్ కోణంలో చూపించబోతున్నాం. వరలక్ష్మి పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటూనే, వినోదాత్మకంగా ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు తెలిపారు. రవిశంకర్, శరత్ లోహితాశ్వ, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మారియో, సంజీవ్ మేగోటి, నిర్మాత: బాలకృష్ణ మహరాణా, దర్శకుడు: సంజీవ్ మేగోటి.