న్యూఢిల్లీ, ఆగస్టు 2: ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని కేంద్రం శనివారం విడుదల చేసింది. వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మీట నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ విడతలో భాగంగా 9.7 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లు జమ చేసినట్టు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
తదుపరి విడత నగదు సాయం పొందాలంటే లబ్ధిదారులైన రైతులంతా ‘ఈకేవైసీ’ పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)కి వెళ్లి ఈకేవైసీ పూర్తిచేయాలని పేర్కొన్నది.