ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాపై వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టిపారేసింది. అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం చరిత్రను వక్రీకరించారని అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ వేసింది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారాజు, కొమ్రంభీంలను దేశభక్తులుగానే చూపామని దర్శకనిర్మాతలు కోర్టుకు నివేదించారు. ఆర్ఆర్ఆర్ కల్పిత కథనేనని దర్శకనిర్మాతలు కోర్టులో తమ వాదన వినిపించారు. విచారణ అనంతరం ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ నిలిపేయాలన్న పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సినిమాతో అల్లూరి, కొమ్రంభీం పేరు, ప్రతిష్టలకు భంగం కలగదని హైకోర్టు వాఖ్యానించింది.
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)డైరెక్షన్లో తెరకెక్కుతుంది ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్ (Ram Charan) నటిస్తుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీమ్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియా భట్ సీత రోల్ చేస్తుండగా..అజయ్ దేవ్గన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.