క్రేజీ ఫైట్‌కు బాక్సాపీస్ వేదిక కానుందా..? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రెండు పెద్ద సినిమాలు నువ్వా..నేనా అన్నట్టుగా తలపడబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటనే కదా మీ డౌటు. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash)నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF 2). ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. నెల్సన్ డైరెక్షన్లో స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న చిత్రం బీస్ట్ (Beast).
వీటిలో కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదల కానుంది. మరోవైపు విజయ్ నటిస్తోన్న బీస్ట్ విడుదలపై సన్ పిక్చర్స్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ..తాజా అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 13న రాబోతుందని టాక్. ఫైనల్ డేట్‌పై అఫీషియల్ అప్ డేట్ ఇవ్వకున్నా..బీస్ట్, కేజీఎఫ్ 2లు బాక్సాపీస్ వద్ద పోటీపడనుండటం దాదాపు ఖాయమైనట్టేనని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న బీస్ట్ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన హలమితి హబిబో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తోన్న కేజీఎఫ్ 2లో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, అర్చన జోయిస్, రామచంద్రరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.