Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్లు ఆవిరి..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ (Foreign Investers) పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో సూచీలు కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1,000 పాయింట్లకుపైగా పతనమైంది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ (Foreign Investers) పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో సూచీలు కుప్పకూలాయి. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1,000 పాయింట్లకుపైగా పతనమైంది. దాంతో ఇటీవలి కాలంలో అత్యంత కనిష్ఠస్థాయి అయిన 71,528 పాయింట్లకు సెన్సెక్స్ (Sensex) సూచీ పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nirty) సైతం 250 పాయింట్లకుపైగా నష్టపోయి 22,300 స్థాయికి దిగజారింది.
ఈ అమ్మకాల ధాటికి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు తెగబడటమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణమైంది. బుధవారం ఒక్కరోజే రూ.10 వేల కోట్లకుపైగా విలువైన భారత ఈక్విటీలను విక్రయించిన ఎఫ్ఐఐలు.. గత రెండు సెషన్లలో కలిపి రూ.20,000 కోట్లకుపైగా ఉపసంహరించుకున్నారు. దీనికి తోడు అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ 5.3 శాతానికి పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.96 దాటడం కూడా మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై నెలకొన్న అనిశ్చితి, మార్కెట్లో పెరుగుతున్న ఒడుదొడుకులు కూడా ఈ నష్టాలకు మరింత ఆజ్యం పోశాయి. అమ్మకాల ఒత్తిడిలో ఆటో మొబైల్, సిమెంట్, మెటల్స్ వంటి రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల షేర్లు కొంతవరకు నిలదొక్కుకున్నాయి. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

