అమరావతి : బీసీల రిజర్వేషన్లు ( BCs Reservation )అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్దిపొందాలని చూసిన ఏపీలో కూటమి సర్కార్‌కు హైకోర్టు ( High Court ) లో ఎదురుదెబ్బ తగలింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత ఆగస్టు నెలలో ఏపీ సర్కార్ రెండు జీవోలను 104, 1065 జీవోలను తీసుకొచ్చింది.
ఈ జీవోలకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టుకు వెళ్లడంతో గురువారం కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేస్తూ ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వార్డుల పునర్విభజన, ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
సర్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు జరపాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, బీసీ జనాభా గణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను కోర్టు కొట్టివేసింది. కాగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు.
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సైతం తోసిపుచ్చింది. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. కేవలం రిజర్వేషన్ల శాతాన్ని మాత్రమే సమీక్షించాలని స్పష్టం చేసింది. కాగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు.