కుర్ర కారు గుండెల్ని పండేసే అందం సన్నీలియోన్ (Sunny Leone) సొంతం. ఈ భామకు సోషల్‌మీడియాలో ఉండే ఫాలోవర్ల సంఖ్య ఎంతంటే చెప్పడం కొంచెం కష్టమే. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. జిస్మ్ 2 చిత్రంతో 2012లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి మెరిసిందీ కెనడియన్ సుందరి. 2014లో కరెంట్ తీగ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2017 పీఎస్వీ గరుడ వేగలో ఐటంసాంగ్ చేసింది.
చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలుకరించబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏ సాంగ్లోనో చిన్న పాత్రలోనే కాదు..ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించనుందట. మంచు విష్ణు (Manchu Vishnu)ప్రస్తుతం గాలి నాగేశ్వర్ రావు (Gali Nageswara Rao)సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సన్నీలియోన్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ రోల్లో కనిపించనుందట.
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో రేణుక అనే ఎన్ఆర్ఐ పాత్రలో సన్నీలియోన్ కనిపించనుందని చెప్పాడు. సన్నీలియోన్ భారత్‌కు వచ్చిన తర్వాత ఓ గ్రామం జీవనశైలి ఎలా మారిపోయిందనే కథాంశంతో ఈ సినిమా సాగనుందట. . అంతేకాదు ఈ చిత్రంలో సన్నీలియోన్, విష్ణు, పాయల్ స్నేహితులుగా కనిపించనున్నట్టు చెప్పాడు.
అంతేకాదు సన్నీలియోన్ ఇప్పటికే తన షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. తిరుపతికి సమీపంలోని రంగంపేటలో ప్రధాన భాగం షూట్ చేశారని సమాచారం. ఈ చిత్రాన్నిఇషాన్ సూర్య తెరకెక్కిస్తున్నాడు.