Stock Markets | నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిఫ్టీ లాభాల జోరుకు బ్రేక్ పడింది. ప్రధానంగా ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లోకి జారాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ నష్టాలతో ముగిశాయి. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిఫ్టీ (Nifty) లాభాల జోరుకు బ్రేక్ పడింది. ప్రధానంగా ఐటీ (IT), ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లోకి జారాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 329.91 పాయింట్లు (0.44 శాతం) నష్టపోయి 74,529.08 వద్ద స్థిరపడింది.
అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 85.30 పాయింట్లు (0.36 శాతం) క్షీణించి 23,329.00 వద్ద ముగిసింది. నాలుగు రోజుల వరుస లాభాల తర్వాత ఇన్వెస్టర్లు హెవీవెయిట్ షేర్లలో లాభాలను స్వీకరించడం మార్కెట్లపై ప్రభావం చూపింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోయింది. దీనితోపాటు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి. మరోవైపు మీడియా, రియల్ ఎస్టేట్, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది.
ఈ రంగాల సూచీలు లాభాల్లో ముగియడంతో మార్కెట్ నష్టాలు కొంతమేర పరిమితమయ్యాయి. నిఫ్టీలో ట్రెంట్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బ్రాడర్ మార్కెట్లో కూడా బలహీనత కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం స్వల్పంగా నష్టపోయాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కొన్ని రంగాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని ఇతర రంగాల్లోకి మళ్లిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

