గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
చుంచుపల్లి మండలంలోని విద్యానగర్, బాబుక్యాంప్ గ్రామ పంచాయతీల్లో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) అనూష ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు...
చుంచుపల్లి, నవంబర్ 03 : చుంచుపల్లి మండలంలోని విద్యానగర్, బాబుక్యాంప్ గ్రామ పంచాయతీల్లో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) అనూష ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ తీరును పరిశీలించి, పారిశుధ్య నిర్వహణపై స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యానగర్ కాలనీలోని ప్రధాన రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం (పీపీబీ), చెత్త వేరు చేసే షెడ్, నర్సరీ తదితర గ్రామ పంచాయతీ ఆస్తులను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.

గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

