ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని ఆదివాసి గూడేలలో ఆదివాసులు దండారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆదివాసులు తమ తమ గూడెల్లో భోగి వేడుకతో దండారి ఉత్సవాలను ప్రారంభించారు.
నార్నూర్, నవంబర్ 3 : దీపావళి పండుగను పురస్కరించుకొని ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని ఆదివాసి గూడేలలో ఆదివాసులు దండారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆదివాసులు తమ తమ గూడెల్లో భోగి వేడుకతో దండారి ఉత్సవాలను ప్రారంభించారు. మంగళవారం దండారి నిర్వాహకులు ఆవరణలో ఏత్మాసూర్ దేవత ప్రతిమలకు, డోలు, డప్పులు,నెమలి టోపీలు, గజ్జెలు, రోలు, మేక చర్మం వంటి గుస్సాడీ వేష ఆదరణ సామగ్రిలకు సాంప్రదాయ పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.
వారం రోజులపాటు ఆదివాసి గూడెళ్లలో నియమ నిష్టతో దండారి ఉత్సవాలు కొనసాగుతాయని, కొల బొడీతో ఈ ఉత్సవాలు ముగిస్తాయని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మెస్రం రూప్ దేవ్ పటేల్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, మెస్రం మోతిరాం పటేల్, కోట్నాక్ నానాజీ, మెస్రం సీతారాం, ఆదివాసి విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు కోట్నాక్ శ్యామ్ రావు, మెస్రం కిరణ్, జుగ్నోక్ భీం రావ్, మోతిరామ్ తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
CM Vijay | పెరందురై సభలో విజయ్.. సీఎం భుజంపై చేయి వేసి ఫొటో దిగిన బామ్మ!
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

