MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. నీళ్లపై ఆధారపడిన పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. నీళ్లపై ఆధారపడిన పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరువును ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. 750 టీఎంసీల గోదావరి నీళ్లు, 50 టీఎంసీల కృష్ణా నీళ్లు ఏపీకి తీసుకెళ్లారన్నారు. అమిత్ షా,రేవంత్ రెడ్డి ఇద్దరూ పోటీ పడి విమర్శలు చేసుకున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ధర్నా,హైదరాబాద్ కు వచ్చి అమిత్ షా పాదయాత్రతో తెలంగాణకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్,బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి అని మండిపడ్డారు. అమిత్ షా హైదరాబాద్ కు వచ్చి గుడికి వెళ్లారు. పాదయాత్ర చేశారు. సభలో మాట్లాడి ఢిల్లీకి వెళ్లిపోయారు. తెలంగాణలో కరువుపై అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు కరువుపై అమిత్ షా కు చెప్పలేదన్నారు. దేశాన్ని మోదీ, అమిత్ షా ఇద్దరు పాలిస్తున్నారు. దేశంలో డి ఫాక్టో పీఎం అమిత్ షా అని పేర్కొన్నారు.
కరువు ఫైల్ కేంద్ర హోం శాఖా, వ్యవసాయ శాఖా మంత్రుల వద్దకు పోతుంది. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు ఏం నాయకులు, మీది ఏం పార్టీ అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ పై అమిత్ షా సిబిఐ విచారణ జరిపించాలి. ఢిల్లీకి రేవంత్ రెడ్డి పైసలు పంపితే కేంద్రం ఏం చేస్తోందన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణను లూటీ చేస్తున్నారు. వేల కోట్లు దండుకుంటున్న రేవంత్ రెడ్డిని మోదీ, అమిత్ షా ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మరో హిమంత బిశ్వ శర్మ లా మోదీ, అమిత్ షా కు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన మోదీ, అమిత్ షా కు ప్రత్యేకమైన ప్రేమ ఉందని పేర్కొన్నారు. కేంద్రం 20 వేల కోట్లు ఇవ్వాలని ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఎందుకు చిన్న ధర్నా చేయలేదని సూటి ప్రశ్నించారు. దేశంలో పెద్ద ఓట్ చోర్ రేవంత్ రెడ్డిది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఇప్పటికీ కేసు ఉందని గుర్తు చేశారు. డీజీపీ రాష్ట్రంలో అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు పాల్వాయి స్రవంతి ,కె .కిషోర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

