Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
Race Course Land: ఢిల్లీలోని రేస్ కోర్సు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూమిపై వివాదం నెలకొన్నది. అయితే ఆ భూమిని ఐఏఎఫ్ ఆధీనంలోనే ఉంచాలని మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. తన రిటైర్మెంట్కు కొన్ని రోజుల ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రేస్ కోర్సు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూమి(Race Course Land)పై వివాదం నెలకొన్నది. ఆ భూమిని ఐఏఎఫ్ ఆధీనంలోనే ఉంచాలని మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. తన రిటైర్మెంట్కు కొన్ని రోజుల ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 26వ తేదీన ఆయన ఆ లేఖ రాశారు. 40 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలాన్ని వైమానిక దళం ఆధీనంలోనే ఉంచాలని ఏపీ సింగ్ రక్షణ మంత్రిని కోరారు. అక్టోబర్ 29వ తేదీన రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన వ్యక్తిగత మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. ఐఏఎఫ్ స్టేషన్లో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సీల్ చేయడంతో ఈ వివాదంపై రక్షణమంత్రికి ఏపీ సింగ్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గృహ నిర్మాణ శాఖ ఆ స్థలాన్ని సీజ్ చేయడం వల్ల రక్షణ రంగంలో ఆందోళన మొదలైంది. సీజ్ చేసిన స్థలంలో గోల్ఫ్ కోర్స్, స్విమ్మింగ్ పూల్, ఇతర ఎమినిటీస్ ఉన్నాయి.అయితే ఈ వివాదం నేపథ్యంలోనే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఫేర్‌వెల్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఐఏఎఫ్ కానీ, రక్షణ శాఖ నుంచి కానీ అధికారిక ప్రకటన లేదు.
ఎయిర్ స్టేషన్ నిర్వహణలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ చాలా ముఖ్యమైందని, ఈ స్థలం ఐఏఎఫ్ వద్దే ఉండాలని, దీని కోసం మరోసారి జాయింట్ సర్వే నిర్వహించాలని ఏపీ సింగ్ తన లేఖలో మంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు. రక్షణ శాఖకు వైమానిక దళం తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 40 ఎకరాల స్థలం సీలింగ్ ప్రక్రియను రద్దు చేయాలని కోరారు. రేస్ కోర్సు ఎయిర్ స్టేషన్‌కు గత చరిత్ర ఎంతో ఉందని, మూడు సెగ్మెంట్లలో భూమి ఉందని, అయితే అవన్నీ సహజంగా పనిచేయాలని ఏపీ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న అత్యంత ఖరీదైన భూమిలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నది. డిఫెన్స్ గోల్ప్ కోర్సులు, స్పోర్ట్స్ ఫెసిలిటీల్లో ఉన్న ప్లాట్ల గురించి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు చెందిన ఎల్ అండ్ డీవో ఇటీవల ఆరా తీసింది. ఎయిర్ ఫోర్స్ గోల్ఫ్ కోర్సును తమకు అప్పగించాలని గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కోరింది. దీంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఖాళీ చేయాలని కోరుతూ ఎల్ అండ్ డీవో శాఖ నోటీసులు జారీ చేసింది.
ఇటీవల ఢిల్లీ రేస్ క్లబ్, జైపూర్ పోలో గ్రౌండ్‌ను కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

