‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
శ్రీజ ఇండస్ట్రీస్‌లో బియ్యం అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ, విజిలెన్స్ విభాగాలతో సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో...
– బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్
– రూ.6.90 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
– 42 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి
కొత్తగూడెం, నవంబర్ 03 : శ్రీజ ఇండస్ట్రీస్‌లో బియ్యం అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ, విజిలెన్స్ విభాగాలతో సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీజ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన 175 మెట్రిక్ టన్నుల బియ్యంలో సుమారు 42 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.6.90 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. ఈ వ్యవహారంలో మిల్లు యజమాని ఆళ్ల మురళీకృష్ణ బాధ్యత వహించాలన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నప్పటికీ, మూడు రోజులైనా ఎఫ్ఐఆర్ కాపీని బహిర్గతం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు ఎఫ్ఐఆర్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారనే సందేహాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముగ్గురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మౌనం వహించడంపై ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాత్రపై, అధికారులపై వస్తున్న ఒత్తిళ్లపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, నిబంధనల ప్రకారం 25 శాతం పెనాల్టీతో సహా మొత్తం నష్టాన్ని రికవరీ చేయాలని కోరారు.
అక్రమ ఆస్తులను జప్తు చేయడంతో పాటు, తనిఖీల్లో నిర్లక్ష్యం వహించిన సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సీబీఐ, ఈడీ విచారణ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన రాజకీయ నాయకుల పాత్రను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాకేష్ బాబు, ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మంగీలాల్ నాయక్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్, బూర్గంపాడు మండల అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, నాయకులు పొదిల్ల శ్రీనివాస్, సబ్బాని రాజేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
Avengers: Doomsday | డాక్టర్ డూమ్ హవా: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి కొత్త పోస్టర్లు విడుదల!
ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
CM Vijay | పెరందురై సభలో విజయ్.. సీఎం భుజంపై చేయి వేసి ఫొటో దిగిన బామ్మ!
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

