Jagadish Reddy | అనుమతి లేకుండా ఒకరి ఆస్తుల దగ్గరకు వెళ్లొద్దని తెలియదా..? కాంగ్రెస్ నేతలపై జగదీష్ రెడ్డి ఫైర్
Jagadish Reddy | అనుమతి లేకుండా ఒకరి ఆస్తుల దగ్గరకు పోకూడదని తెలియదా..? అనుమతి లేకుండా ఒకరి ఇంటికి పోవాలన్న సంగతి తెలియదా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
Jagadish Reddy | కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద వందలాది మంది పోలీసులు మోహరించిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా పోలీసులతో జగదీష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం దిగ్బంధనం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, విప్లు ఒకరి ప్రైవేట్ ఆస్తుల మీదికెళ్లడంపై జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశంలో ఉండే 542 పార్లమెంట్ సభ్యుల్లో మీరు కొందరు.. ఈ రాష్ట్రంలో ఉన్న శాసనమండలి సభ్యుల్లో, 119 మంది శాసనసభ్యుల్లో మీరు కొందరు..విప్లు, అధికార ప్రతినిధులు, పదవుల్లో ఉన్నవాళ్లు.. మీరందరూ కూడా అనుమతి లేకుండా ఒకరి ఆస్తుల దగ్గరకు పోకూడదని తెలియదా..? అనుమతి లేకుండా ఒకరి ఇంటికి పోవాలన్న సంగతి తెలియదా..? అని ప్రశ్నించారు.
మీ ఇండ్లళ్లకు కూడా ఎవరైనా వస్తే అనుమతిస్తారా..? అట్లా రావడం సరైందా..? ఏరకంగా పోయినరు.. ఏరకంగా ఈ పని చేశారు.. మీ అందరికీ ఈ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసినవాళ్లెవరు.. ఈ ఖర్చులు పెట్టిన వాళ్లెవరు.. ఇది ప్రభుత్వం నుంచి చేసిర్రా.. పార్టీలో చేసిర్రా.. లేదా భట్టి విక్రమార్క ప్రగతిభవన్లో నివసిస్తున్నరు.. కాబట్టి ఆయన ఏర్పాటు చేసిర్రా..? దీనివెనుకాల ముఖ్యమంత్రి ఉన్నడా.. ఎవరున్నరు.. ఎవరి ప్రోద్భలంతోని మీరంతా కూడా పోయారు. దీంట్లో ప్రభుత్వ ఖర్చు ఎంత..? ప్రజలకు చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
అనుమతి లేకుండా వేరే వాళ్ల ఆస్తుల వద్దకు పోవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తెలియదా?
మీ ఇంట్లోకి కూడా అలా వస్తే అనుమతిస్తారా? మీరు అలా ఎలా వెళ్లారు?
మీకు ఈ ట్రాన్స్పోర్ట్ కోసం ఖర్చు చేసింది ఎవరు.. పార్టీనా? లేక ప్రభుత్వ ఖర్చా?
దీని వెనక ముఖ్యమంత్రి ఉన్నాడా, ఉపముఖ్యమంత్రి… https://t.co/R1cmljssrv pic.twitter.com/9qgm4EzSP7
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026
Read Also :
Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

