కారేపల్లి, సెప్టెంబర్ 22 : కామేపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐగా పదోన్నతి పొందిన జి.హరిని కామేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నూనావత్ సాగర్ అభినందించారు. కారేపల్లి సర్కిల్ కార్యాలయంలో కామేపల్లి ఎస్ఐ పి.శ్రీకాంత్ తో కలిసి హరి మంగళవారం సీఐ సాగర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ సాగర్ స్వీట్ తినిపించి హరికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు శాఖలో పదోన్నతి పొందడం పట్ల కారేపల్లి ఎస్ఐ బి.గోపి, కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ హరికి అభినందనలు తెలిపారు.