‘నిమజ్జనాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు’
గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కారేపల్లి ఎస్ఐ బైరు గోపి అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా..
– కారేపల్లి ఎస్ఐ బైరు గోపి
కారేపల్లి, సెప్టెంబర్ 22 : గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కారేపల్లి ఎస్ఐ బైరు గోపి అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 110 చోట్ల విగ్రహ మండపాల ఏర్పాటుకు పోలీసు శాఖ అనుమతిచ్చిందన్నారు. కారేపల్లి పెద్ద చెరువు, భాగ్యనగర్ తండా, బొడ్రాస్ కుంట, బుగ్గవాగు, గాదెపాడు, పేరుపల్లి, మాదారం చెరువుల వద్ద గల నిమజ్జన ప్రదేశాల్లో అవసరమైన మేరకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
డీజేలకు అనుమతి లేదు
గణేష్ విగ్రహాల ఊరేగింపుల్లో డీజేలు వినియోగించేందుకు అనుమతి లేదని ఎస్ఐ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేయడం, అధిక శబ్దంతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసుల సూచనలు పాటించాలి
గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువత అత్యుత్సాహానికి లోనుకాకుండా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ఊరేగింపుల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడపడం, ప్రమాదకరంగా వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు పోలీసు సిబ్బందికి సహకరించాలని, నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పాటించాలని కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పండుగను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సై పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించినా, పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు సమన్వయంతో వ్యవహరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఎస్ఐ కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

