Parineeti Chopra | బాలీవుడ్ స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట అమృత్సర్ (Amritsar)లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. శ్రీ హర్మందిర్ సాహిబ్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కొంత కాలంగా డేటింగ్లో ఉన్న రాఘవ్-పరిణీతి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే 13వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాజీవ్ చౌక్‌లోని కపుర్తాల హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వేడుక జరిపించారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Viral Video | ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై నీళ్లు పోసిన పోలీసు.. వీడియో
Allan Border | పార్కిన్సన్ వ్యాధి బారిన పడిన క్రికెట్ దిగ్గజం.. 80 ఏళ్లు జీవిస్తే అద్భుతమే అంటూ..
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం.. ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది