Allan Border | ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ దిగ్గజం అలెన్ బోర్డర్ (Allan Border) షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తాను పార్కిన్సన్ వ్యాధి (Parkinsons disease)తో బాధపడుతున్నట్లు చెప్పారు. 2016లో వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. జులై 27న 68వ ఏటలో అడుగుపెట్టిన ఆయన.. 80 ఏళ్ల వరకు జీవిస్తే అద్భుతమేనని అన్నారు.
న్యూరోసర్జన్ దగ్గరకు వెళ్తే తనకు పార్కిన్సన్ ఉన్నట్లు తేలిందని బోర్డర్ అన్నారు. తాను వ్యక్తిగత గోప్యత పాటిస్తానని.. అందుకే ఈ వ్యాధి ఉందని తెలిసి తన పట్ల ఎవరూ సానుభూతి వ్యక్తం చేయొద్దని అనుకున్నట్లు చెప్పారు. కానీ, ఏదో ఒకరోజు అందరూ ఈ విషయాన్ని పసిగడతారని మాత్రం తెలుసన్నారు. తనకు భవిష్యత్తు గురించి భయం లేదన్నారు. 80 ఏళ్ల వరకూ జీవిస్తే అదో అద్భుతమే అని.. 100 ఏళ్ల వరకూ ఉంటానని మాత్రం అనుకోవడం లేదని అలెన్ బోర్డర్ చెప్పుకొచ్చారు.
Also Read..
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం.. ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
Bus Accident: డీఎన్ఏ పరీక్షలు చేసి శరీరాలను గుర్తిస్తాం: ఫడ్నవీస్
SSC Recruitment | స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 1558 ఉద్యోగాలు