బుల్దానా: మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదం(Bus Accident)లో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఒకవేళ అవసరం అయితే కాలిపోయిన శరీరాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తామని ఆయన అన్నారు. రోడ్డు నిర్మాణం వల్ల ప్రమాదం జరగలేదన్నారు. సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాత్రి బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఇవాళ సీఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సందర్శించనున్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని కూడా వాళ్లు కలవనున్నారు.
#WATCH | Bodies will be identified using DNA testing if required, says Maharashtra Deputy CM Devendra Fadnavis on Buldhana bus accident. pic.twitter.com/0DpF8Y29LS
— ANI (@ANI) July 1, 2023