కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో తహసీల్దార్ ఏసీబీ (Acb ) వలలో చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్( Tahasildar Srinivas Rao) గా పనిచేస్తున్న యార్లగడ్డ శ్రీనివాస్ రావుతో పాటు లంచం తీసుకోవడంతో మద్యవర్తిగా వహించిన ప్రైవేట్ వ్యక్తి చినూరు అజయ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు.
మండలానికి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని తన పేరు మీద బదిలీ చేయాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో సిబ్బంది కార్యాలయంపై మాటు వేసి తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.