People Media Factory | కథాబలమున్న సినిమాలతో సినిమాలు తెరకెక్కిస్తూనే.. కొత్త టాలెంట్‌తో ప్రయోగాలు చేసే బ్యానర్లలో ముందు వరుసలో ఉంటుంది టీజీ విశ్వప్రసాద్ పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ. ఈ లీడింగ్ బ్యానర్ సినీ జనాలకు వినోదాన్ని అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలను లైన్లో పెట్టిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే రవితేజ మిస్టర్ బచ్చన్, ప్రభాస్‌తో రాజాసాబ్ లాంటి భారీ సినిమాలను తెరకెక్కిస్తోంది.
కాగా ఈ బ్యానర్ ఆసక్తికర అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ధార్కారి #MM పార్ట్ 2 (Daarkaari #MM Part 2) టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించింది. లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనేది సస్పెన్స్‌లో పెడుతూ.. డిజైన్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక మూవీ పార్ట్ 1లేకుండానే.. పార్ట్ 2 అంటూ ప్రకటించేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది టీం.
టిల్లు స్క్వేర్ చిత్రానికి రైటర్‌గా పనిచేసి.. మ్యాడ్ సినిమాతో నటుడిగా మెప్పించిన రవి ఆంథోని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అంతేకాదు ఇది పాన్ ఇండియా సినిమా కాదట. పాన్ మసాలా సినిమా అని ప్రీ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రానికి చైతు జొన్నలగడ్డ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. చైతు సిద్దు జొన్నల గడ్డ బబుల్ గమ్ సినిమాతో యాక్టర్‌గా మెరిశాడు. ఈ చిత్రానికి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Puri Jagannadh | పూరీ-రామ్ మాస్ బరాత్ షురూ అయింది రో.. డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ టైం
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ
Committee Kurrollu | యదువంశీ కథకు జీవం పోశాడు.. కమిటీ కుర్రోళ్లు మూవీపై రాంచరణ్