Ram Gopal Varma | ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే కొన్ని సార్లు వివాదాలకు సంబంధం లేకుండా పలు సామాజిక సమస్యలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ అందరినీ ఆలోచింపజేస్తుంటాడు. అలాంటి సమస్యల్లో ఒకటి వీధికుక్కల దాడులు. వీధి కుక్కల దాడిలో చిన్నారుల ప్రాణాలు పోతున్న ఘటనలపై ఇప్పటికే తీవ్రంగా స్పందించాడు వర్మ. తాజాగా ఈ విషయంపై మరోసారి ట్వీట్ల వర్షం కురిపించాడు.
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్.. నగరంలో పట్టపగలు ఓ నాలుగేళ్ల చిన్నారిని వీధికుక్కలు ఎలా చంపాయో చూడండి అంటూ వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు వర్మ.
వీధి కుక్కల దాడుల్లో మనుషులు చనిపోతుంటే జంతు ప్రేమికులు కుక్కల హక్కులపై మాట్లాడుతున్నారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి మాత్రం ముందుకు రారు. మీ విలాసవంతమైన ఇళ్లలో కుక్కలను ప్రేమించండి.. కుక్కలు చనిపోతే కన్నీళ్లు కారుస్తున్నారు. మనుషులు చనిపోతే మాత్రం కన్నీరు పెట్టుకోరు. గేటెడ్ కమ్యూనిటీల్లో వీధి కుక్కల దాడులు జరుగవు. పేదల బస్తీల్లోనే వీధి కుక్కలు ప్రాణాలు తీస్తాయంటూ వర్మ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
నేను స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఐదు కుక్కలు ఉరుక్కుంటూ మా వెంబడి పడతాయి. స్కూల్కెళ్లి అమ్మ నన్ను తీసుకొచ్చేటప్పుడు ఆ కుక్కలు మా వెనకాలే ఎగబడతాయి.. మా ఫ్రెండ్స్ మీద కూడా అట్లనే ఎగబడతాయి అంటూ ఓ చిన్నారి మాట్లాడిన వీడియోను వర్మ షేర్ చేస్తూ.. డాగ్ లవర్స్ ఈ చిన్నారి వీధి కుక్కల గురించి ఏం మాట్లాడుతుందో చూడండి.. అని ట్వీట్ చేశాడు.
ఇటీవలే వీధి కుక్కల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జంతు జనాభాపై నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని.. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటికి తరలించారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
To all the DOG LOVERS who are crying hoarse on the SUPREME court’s judgement on STRAY DOGS , please check this video , where a 4 year old boy was killed by street dogs in broad day light in the middle of a city pic.twitter.com/DWtVnBchvQ
— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025
Hey DOG LOVERS , See this small child talking about STRAY DOGS pic.twitter.com/b99YpGUvyw
— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025
— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025
Here are my 10 points addressing the DOG LOVERS who are UPSET about the SUPREME COURT’S decision on STRAY DOGS
1. People are being bitten and killed all over by stray dogs. And dog lovers are busy tweeting about dog rights.😳https://t.co/9RLkoJdqOE can love your pets in your…
— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025
Aamir Khan | ‘కూలీ’ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
Javed Akhtar | దేశద్రోహి అన్న నెటిజన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జావేద్ అక్తర్
Kangana Ranaut | ఆడవాళ్లనే తప్పుగా చూస్తారు.. పెళ్ళైన వారితో రిలేషన్‌పై కంగనా కామెంట్స్