Payal Rajput | ‘మంగళవారం’ సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న పాయల్ రాజ్‌పుత్ తాజాగా రక్షణ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమాను ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహించాడు. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ఈ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా పాయల్‌రాజ్‌పుత్ ఈ సినిమాలో నటించగా.. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రకాశ్ జోసెఫ్, రమేశ్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రోషన్, మానస్, రాజీవ్‌కనకాల, వినోద్‌బాల తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, సంగీతం: మహతిసాగర్.
Also read..
Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన కారు.. ముగ్గురు హైదరాబాద్ యువకులు మృతి
Korba-Visakha Express | కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం