టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పీఎస్పీకే 28 (PawanKalyan28). గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar), పవన్ కల్యాణ్ (Tollywood) కలయికలో వస్తున్న సినిమా కావడంతో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సూపర్ హిట్ కాంబోకు సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఇవాళ పవన్ కల్యాణ్ ను కలిశారు. సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే విషయంపై చర్చించారు.
ఈ ఫొటోను ట్విటర్ ద్వారా అందరితో పంచుకున్నారు మైత్రీ మూవీ మేకర్స్. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్ బాస్టర్ కాంబో షూటింగ్ కు రెడీ అయింది. పీఎస్పీకే 28 త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని టీం ట్వీట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారని ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలని హరీష్ శంకర్ భావిస్తున్నట్టు టాక్. దీనిపై అధికారిక ప్రకటన వస్తే స్పష్టత రానుంది.
అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయబోతున్నాడు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్-పవన్ కల్యాణ్-దేవీ శ్రీ ప్రసాద్ కలయికలో ఈ సినిమా వస్తుండంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Most awaited Blockbuster Combo is ready to begin shoot 🎥 #PawanKalyan28 will be on sets very soon!
— Mythri Movie Makers (@MythriOfficial) September 6, 2021
Stay excited 🤘@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai pic.twitter.com/wa5lMNW7hH
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!