Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంపౌండ్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. హరిహరవీరమల్లు పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
కాగా ఈ మూవీ నుంచి కొల్లగొట్టినాదిరో సెకండ్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న లాంచ్ చేయనున్నారని తెలిసిందే. అయితే ఈ పాట ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ తాజా అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మణిరత్నం గురు సినిమాలోని పాపులర్ సాంగ్ తేరే బినా లైన్లో కొల్లగొట్టినాదిరో పాట ఉండబోతుందట. పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ కాంబోలో వచ్చే ఈ పాటను భారీ ప్యాలెస్‌లో ఐదు రోజులపాటు షూట్ చేసినట్టు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. మొత్తానికి విడుదలకు ముందే ఈ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చి సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Mazaka | సందీప్ కిషన్ మజాకా టీం క్రేజీ ప్లాన్.. రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ చూశారా..?
Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్