Pawan Kalyan | స్టార్ టెక్నీషియన్‌ను రిపీట్ చేస్తున్న పవన్…ఇంతకీ ఏ సినిమాకంటే..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఇపుడు మరో సినిమాకు సంబంధించిన వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ (Kollywood)స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హరిహర వీరమల్లు కోసం పవన్ ఏకంగా 5 నెలలు కాల్షీట్లు ఇచ్చాడని ఇప్పటికే ఓ వార్త వచ్చింది. కాగా ఇపుడు మరో సినిమాకు సంబంధించిన వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సీతమ్ (Vinodaya Sitham) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.
కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని (Samutirakani) డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ తోపాటు సాయిధరమ్ తేజ్ కూడా కీ రోల్లో కనించనున్నాడని టాక్. కాగా ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ మరోసారి స్టార్ టెక్నీషియన్‌ను తన టీంలోకి తీసుకోబోతున్నాడట. ఇటీవలే వచ్చిన భీమ్లా నాయక్ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేశారు రవి కేచంద్రన్ (Ravi K Chandran). ఈయన పనికి ఇంప్రెస్ అయిన పవన్ కల్యాణ్ వినోదయ సీతమ్ రీమేక్‌కు కూడా మరోసారి కెమెరామెన్‌గా తీసుకోవాలని ఫిక్సయ్యాడట.
Read Also : Sai Pallavi labourer Look | కూలీగా మారిన సాయిపల్లవి..సినిమా కోసమైతే కాదు..ఫొటోలు వైరల్
ఆసక్తికర విషయమేంటంటే పవన్ కల్యాన్ ఈ సినిమా కోసం 21 రోజులు కాల్షీట్లు ఇచ్చాడట. పీపుల్ మీడియా ఫాక్టరీ, జీ 5తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తోన్న ఈ మూవీలో ఇతర నటీనటుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్ కల్యాణ్.
Read Also : Chiranjeevi | పవన్ కల్యాణ్ పాపులర్ సీన్ చేయబోతున్న చిరంజీవి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

