Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. హరిహరవీరమల్లు పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
కాగా న్యూ ఇయర్ కానుకగా మేకర్స్ ఏదైనా అప్డేట్ అందిస్తారేమోనని చూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం అదిరిపోయే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. హరిహరవీరమల్లు ఫస్ట్ సింగిల్‌ను జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ పాటను పవన్ కల్యాణ్ పాడటం విశేషం. తెలుగుతోపాటు మిగిలిన భాషల్లో కూడా పవన్ కల్యాణ్ వాయిస్‌తో పాట ఉండబోతుందట. ఇప్పటికే పవన్ కల్యాణ్ పాడిన పాటలు సూపర్ హిట్‌గా నిలువడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హైప్ క్రియేట్ చేశాయి.
మరి పీరియాడిక్ డ్రామాకు స్టార్ యాక్టర్ వాయిస్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
క్లైమాక్స్‌లో వచ్చే రెడ్ డ్రెస్ ఫైట్‌ను 42 రోజులపాటు చిత్రీకరించినట్టు ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇంట్రో సాంగ్, టైగర్ ఫైట్, మహల్ యాక్షన్ పార్ట్, కుస్తీ ఫైట్ సీన్, చార్మినార్ యాక్షన్ సన్నివేశాలు, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ భారీ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ వార్ సీన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించబోతున్నాయట.
Hari Hara Veera Mallu
1⃣st single – Jan 1st 1⃣2⃣ AM✅
Vocals – Pawan Kalyan🎙️ pic.twitter.com/2LNC9GR6GG— Manobala Vijayabalan (@ManobalaV) December 26, 2024
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు..!
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్