టాలీవుడ్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) క్రేజీ కాంబోలో మల్టీస్టారర్ వస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించిన తమిళ చిత్రం వినోధయ సీతమ్ (Vinodaya Sitham remake)ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో కూడా సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. PKSDT గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతోంది.
కాగా హీరోయిన్లుగా ఎవరెవరు నటిస్తున్నారనే విషయంతోపాటు ఇతర నటీనటుల వివరాలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అదేవిధంగా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇప్పటికే డైరెక్టర్ సముద్రఖని PKSDT లొకేషన్లో యాక్షన్ అని చెబుతూ.. మానిటర్ చేసుకుంటున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
PKSDT ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. తెలుగు వెర్షన్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని మార్పులు చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్..
Presenting the cast of one of our most ambitious project #PKSDT 🤩
Pawankalyan
SaiDharamTej
Ketikasharma
Rohini
Brahmanandam
Tanikellabharani
Subbaraju
Priya prakash warier
Raja ChemboluStorming updates on the way💥🌀 pic.twitter.com/55TS3TazyN
— People Media Factory (@peoplemediafcy) February 28, 2023
సముద్రఖని యాక్షన్ మూడ్..
#PKSDT shoot going in Swift Mode💥
Director @thondankani in action mode🎬
Storming updates on the way🌀@PawanKalyan @IamSaiDharamTej@vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth pic.twitter.com/cRm2rjCY2o
— BA Raju's Team (@baraju_SuperHit) February 28, 2023
Vennela Kishore | ఇండియన్ 2లో వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Mangalavaaram | సస్పెన్స్ గా అజయ్ భూపతి మంగళవారం టైటిల్ లుక్
Bichagadu 2 | శాకుంతలం వర్సెస్ బిచ్చగాడు 2.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఫైట్