ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి కాంపౌండ్ నుంచి వస్తున్న మరో సినిమా మంగళవారం (Mangalavaaram). ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పటికే వచ్చాయి.
అయితే చాలా రోజుల తర్వాత అధికారికంగా ప్రకటిస్తూ.. మంగళవారం టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను లాంఛ్ చేశారు. ఫీ మేల్ ఓరియెంటెడ్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటిస్తోంది. సీతాకోక చిలుక థీమ్‌లో పోస్టర్ లుక్ కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో చాలా మంది లైట్స్ పట్టుకొని కనిపిస్తున్నారు. టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యం కాబోతున్నారు. కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి మాత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు తాజా లుక్‌తో తెలిసిపోతుంది.
నాలుగు భాషల్లో మంగళవారం టైటిల్ పోస్టర్..
Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋
It's a PAN-SOUTH INDIAN movie🔥
'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023
Vennela Kishore | ఇండియన్ 2లో వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Samuthirakani | యాక్షన్ మూడ్‌లో సముద్రఖని.. PKSDT షూటింగ్ అప్డేట్
Bichagadu 2 | శాకుంతలం వర్సెస్ బిచ్చగాడు 2.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఫైట్