Pawan Kalyan | రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమండ్రిలో శనివారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్ అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న రాంచరణ్ అభిమానులు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాకినాడ-రాజమండ్రి మధ్య ఎడిబి రోడ్డును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి శిథిలావస్థకు చేరిన ఈ రోడ్డుకు సరైన నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు.
కాగా నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఇద్దరు అభిమానుల కుటుంబసభ్యులకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
Game Changer | గేమ్ ఛేంజర్‌లో ఈవెంట్లో విషాదం.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన దిల్ రాజు
Nara Brahmani | మణిరత్నం సినిమాకి బాలకృష్ణ కూతురు ఎందుకు నో చెప్పిందంటే.?