Pawan Kalyan | టాలీవుడ్ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా రోజులకు షూటింగ్స్ కోసం టైం కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఖాతాలో ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh), హరిహరవీరమల్లు (Harihara Veeramallu), ఓజీ సినిమాలున్నాయి. కాగా ఇటీవలే హరిహరవీరమల్లు షూటింగ్ షురూ కాగా.. పవన్ కల్యాణ్ సుమారు ఏడాది తర్వాత మళ్లీ సెట్స్‌లో జాయిన్ అయినట్టు ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పటికే వార్త హల్ చల్ చేస్తోంది.
కాగా ప్రస్తుతం హరిహరవీరమల్లు చిత్రీకరణ విజయవాడలో కొనసాగుతోంది. డిప్యూటీ సీఎంగా విధుల నిర్వర్తించాల్సి ఉండటంతో.. సమయం వృధా కాకుండా ఉండేలా అక్కడే ప్రత్యేకంగా సెట్స్, స్టూడియోను నిర్మించారట. దీంతో పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం భారీగానే ఖర్చవుతుందని ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. తాజా సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ అధికారిక పనులు లేనప్పుడు మాత్రమే సెట్స్‌కు వచ్చి కొన్ని గంటలే సెట్స్ కోసం టైం కేటాయిస్తున్నాడట. ఈ లెక్కన షూటింగ్ షెడ్యూల్ సాగుతుండటం ద్వారా ప్రొడక్షన్ ఖర్చు కూడా పెరిగిపోతుందన్న మాట. ఈ లెక్కన మిగిలిన రెండు సినిమాల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉండనుందని అర్థమవుతుంది.
కాగా ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో పవన్ వెనక పిస్తోల్ పెట్టుకొని మాస్ ఎంట్రీ ఇస్తూ అదరగొట్టేస్తున్నాడు. భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన స్టైల్ మ్యానరిజంతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. మరోవైపు సుజిత్ డైరెక్షన్లో వస్తోన్న ఓజీ నుంచి లాంచ్ చేసిన Hungry cheetah గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్
Jani Master | రెండో రోజు విచారణ.. షూటింగ్ స్పాట్స్‌కు జానీ మాస్టర్.. !
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్