Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా… హరిహరవీరమల్లు పార్ట్-1 జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచింది. సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలపై భారీ ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తాయి. కాగా థియేటర్లలో అంతగా ఇంప్రెస్ చేయలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది హరిహరవీరమల్లు. ఈ మూవీ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా పలు మార్పులతో ఓటీటీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. ఓటీటీ మూవీ లవర్స్ కోసం కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేశారు. వీఎఫ్ఎక్స్ హార్స్ రైడింగ్ సెకండాఫ్‌లో పవన్ కల్యాణ్ విల్లు ఎక్కుపెట్టే సన్నివేశాలపై ప్రేక్షకులు, అభిమానుల పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
తుఫాను వచ్చే సమయంలో వారి మధ్య జరిగే ఘర్షణకు సంబంధించిన సీన్లను తీసివేశారట. ఓటీటీ వెర్షన్లో ఈ సన్నివేశాలను పూర్తిగా తొలిగించారని ఇన్సైడ్ టాక్. కొత్త వెర్షన్ ప్రకారం అసుర హననం పాట తర్వాత పార్ట్ 2 అనౌన్స్‌మెంట్‌తో సినిమా ముగియనుంది. బాబీ డియోల్‌తో ఎదురుపడే సన్నివేశాలు, సైక్లోన్ ఫైట్ సహా 15 నిమిషాలు ఓటీటీ వెర్షన్లో తీసేశారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ కట్స్ తీసేయగా ప్రస్తుతం హరిహరవీరమల్లు ఓటీటీ రన్‌టైం 2 గంటల 33 నిమిషాలన్నమాట. మరి ఓటీటీలో ఎలాంటి ఇంప్రెషన్ కొట్టేస్తుందో చూడాలి.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మించారు.
Mandaadi | ఈ సారి తగ్గేదేలే అంటున్న సుహాస్.. హైప్ పెంచుతోన్న మండాడి స్పెషల్ పోస్టర్
War 2 | కూలీ చిత్రాన్ని అందుకుంటుందా..? తారక్, హృతిక్ రోషన్ వార్ 2 బాక్సాఫీస్ వసూళ్లు ఇవే
Shruti Haasan | నంబర్ గేమ్ కొత్త సమస్య.. కమల్ హాసన్ థగ్‌లైఫ్ ఫెయిల్యూర్‌పై శృతిహాసన్