Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). ఏపీ ఎన్నికల కారణంగా మధ్యలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ మళ్లీ 2024లో షూటింగ్ మొదలు పెట్టుకున్న విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు హరిహరవీరమల్లుతోపాటు మిగిలిన సినిమాల షూటింగ్స్‌పై ఫోకస్ పెట్టాడు. కాగా ఇప్పుడిక హరిహరవీరమల్లు టీం నుంచి అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ చివరి షెడ్యూల్ కొనసాగుతోంది. ఇందులో వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తున్న పాపులర్ యాక్టర్ కబీర్ దుహర్ సింగ్ చివరి షెడ్యూల్ అంటూ క్యారవాన్‌లో నుంచి బయటకు వస్తున్న స్టిల్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్‌కు డేట్స్ సర్దుబాటు కాని కారణంగా ఆయన స్థానంలో సత్యరాజ్‌ను రీప్లేస్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. హరిహరవీరమల్లు పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
#HHVM
Last scheduleGratitude ❤️ pic.twitter.com/EoYXbScqjI
— Kabir Duhan Singh (@Kabirduhansingh) February 5, 2025
మాట వినాలి లిరికల్ వీడియో..
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?