Pawan Kalyan | పాపులర్ కథానాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గురువారం కర్ణాటక పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఏపీలోని కొన్ని ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో ఎనుగుల గుంపులు వచ్చి పంటలను నాశనం చేస్తుండటంతో.. ఆ ఏనుగుల గుంపును చెదరగొట్టాడనికి కుంకీ ఎనుగులు అవసరం. వాటిని కర్ణాటక ప్రభుత్వం నుంచి అడిగి తీసుకరావడంతో పాటు పలు అంశాలను చర్చించడానికి కర్ణాటక అటవీ శాఖ మంత్రితో చర్చలు జరపడానికి పవన్‌కల్యాణ్ కర్ణాటక వెళ్లారు.
అయితే అక్కడికి వెళ్లిన పవన్‌కళ్యాణ్ మీడియా సమావేశంలో ప్రజెంట్ వస్తున్న సినిమాలపై కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు ముందు సినిమాల్లో హీరోలు అడవిని రక్షించే కథానాయకుల పాత్రలు వేస్తే.. ఇప్పుడు అడవిని నరికి స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అనుకునే పాత్రలు పోషిస్తున్నారని అన్నారు.
‘నేను సినిమా వాడిలా ఈ మాటలు మాట్లాడకూడదు. కానీ తప్పటం లేదు. దివంగత నటుడు రాజ్‌కుమార్ అడవులను కాపాడే హీరోగా చేసిన గంధడగుడి సినిమాల్లాంటివి చేయాలని వుండేది. సో.. ఇలాంటి సినిమాలు కాకుండా అడవుల ప్రాముఖ్యతను తెలిసేలా సినిమాలు రావాలి’ అన్నారు. అయితే ఇప్పుడు ఈ మాటలు సోషల్‌మీడియాలో హీరో అల్లు అర్జున్‌కు ఆపాదిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్‌కు అల్లు అర్జున్‌కు వున్న మనస్పర్థల కారణంగానే పవన్‌కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యాలు చేశారని అంటున్నారు. అయితే ప్రస్తుతం అత్యధిక బడ్జెట్‌తో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సెట్స్ మీద వుంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ బాగు కోరే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అంటే కేవల ఒక హీరోనే కాదు సినిమా నిర్మాతలు అంత పెట్టుబడి పెట్టిన నిర్మాతలు కూడా వుంటారు. డిప్యూటి సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు వల్ల నిర్మాతలకు నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అంటూ కొంత మంది పవన్ వీడియోపై కామెంట్స్ పెడుతున్నారు.
Also read..