Kangana Ranaut : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాను బీజేపీ ఎంపీ, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రశంసించారు. భారత్ స్వర్ణ పతకం సాధించలేదు..కానీ భవిష్యత్‌లో మన అథ్లెట్లు మెరుగైన సామర్ధ్యం కనబరుస్తారనే విశ్వాసం తనకుందని ఆమె చెప్పారు. ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల జట్టు కాంస్య పతకం సాధిచడం సంతోషంగా ఉందని అన్నారు.
భారత హాకీ ఆటగాళ్లు దేశంలో హాకీ గత వైభవాన్ని తిరిగి పొందేందుకు శ్రమిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని ఆమె గుర్తుచేశారు. కాగా, ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించడం గొప్ప విషయమని భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే అద్భత అవకాశం కేవలం కొద్దిమంది అథ్లెట్లకే లభిస్తుందని చెప్పారు. ఒలింపిక్స్‌లో దేశం తరపున పాల్గొన్న క్రీడాకారులందరికీ తాను శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొని సత్తా చాటడం ఏమంత సులభం కాదని, దీనికి చిత్తశుద్ధి, కఠోర శ్రమ అవసరమని పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను తాను అభినందిస్తున్నానని అన్నారు.
నీరజ్ చాలా బాగా ఆడాడని, ఆయన తమ బంగారం అని హర్భజన్ అన్నారు. భారత రెజ్లర్ వినేశ్ పొఘాట్పై అనర్హత వేటు పడిన విషయం ప్రస్తావిస్తూ ఈ సంక్లిష్ట సమయంలో తాను ఆమె వెన్నంటి నిలుస్తానని, ఆమె బాధను కేవలం ఓ అథ్లెట్ మాత్రమే అర్ధం చేసుకోగలరని చెప్పారు. వినేష్ పొఘాట్ రజత పతకానికి అర్హురాలని హర్భజన్ సింగ్ తేల్చిచెప్పారు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సత్తా చాటాడు. భారత్‌కు స్వర్ణం అందిస్తాడనే అంచనాలను అధిగమించలేకపోయినా రజతం దక్కించుకున్నాడు.
Read More :
Indian 2 | ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్ ఇండియన్ 2.. ఫ్లాట్‌ఫాం ఇదే