ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) మృతి పట్ల టాలీవుడ్ నటులు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సినీ పాటకు సాహిత్య గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి సిరివెన్నెల అని బాలకృష్ణ (Sirivennela Sitaramasastri) అన్నారు. తెలుగు పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.
తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పవన్ కల్యాణ్ అన్నారు. సిరివెన్నెల పాటల్లో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బలమైన భావాన్ని, మానవత్వాన్ని, ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు ఇక లేరనే వాస్తవం జీర్ణించుకోలేనిది. సినీ పరిశ్రమకే కాదు..సాహితీ లోకానికి తీరని లోటు.
సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నా పట్ల ఎంతో ఆప్యాయత కనబరిచే వారు. ఆయనతో మాట్లాడితే సాహిత్యం, ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయ వాదం, సామ్య వాదం వరకు ఎన్నో అంశాలనుకూలంకషంగా చెప్పేశారు అంటూ జనసేన పార్టీ ట్విటర్ లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్.
తెలుగు సాహిత్యానికి శ్రీ సీతారామ శాస్త్రి గారి మరణం తీరని లోటు – JanaSena Chief Sri @PawanKalyan #SirivennelaSeetharamaSastry pic.twitter.com/AGQ7Rm6rFN
— JanaSena Party (@JanaSenaParty) November 30, 2021
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు