Parineeti Chopra | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) , బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఎంగేజ్మెంట్కు సమయం దగ్గరపడుతోంది. సంబంధిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. వీరి నిశ్చితార్థ వేడుకకు (engagement ceremony) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ శనివారం (మే 13వ తేదీ) సెంట్రల్ ఢిల్లీ (Central Delhi)లో వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలిసింది.
కాగా, తాజా సమాచారం ప్రకారం.. వీరి నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు రాజకీయ నేతలు మాత్రమే హాజరవుతారని సమాచారం. ఈ మేరకు 150 మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు ఇద్దరికీ దగ్గర వ్యక్తులు వెల్లడించారు. ఈ వేడుకలో ముందుగా ప్రత్యేక ప్రార్థనలు (ardas or prayer) నిర్వహించనున్నారని.. అనంతరం ఇరు కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఉంగరాలు మార్చుకోనున్నట్లు తెలిపారు. అతిథుల కోసం ప్రత్యేకంగా లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉందని వారు చెప్పుకొచ్చారు.
Also Read..
Samantha | లగ్జరీ అపార్టుమెంట్ కొనుగోలు చేసిన సామ్.. వామ్మో ధర అన్ని కోట్లా?
LinkedIn LayOffs | కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు.. లింక్డ్ఇన్నూ తాకిన లేఆఫ్స్ సెగ
Zero Shadow Day | అద్భుతం ఆవిష్కృతం.. హైదరాబాద్లో మాయమైన నీడ