Samantha Rutu Prabhu | పన్నెండేళ్ల క్రితం ఏ అబ్బాయిని కదిలించినా సమంత నామమే జపం చేశారు. అంతలా ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది సామ్. ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’ వరుస పెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ హీరోలకు లక్కి చార్మ్ అయిపోయింది. దాదాపు దశాబ్ద కాలం పాటు దక్షిణాది అగ్ర హీరోయిన్గా సామ్ చక్రం తిప్పింది. అయితే ఈ మధ్య కాస్త డల్ అయింది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసే సామ్ గత మూడేళ్లలో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసింది. అందులో ఒక్కటి మాత్రమే కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇక ఇటీవలే ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన శాకుంతలం తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.
ప్రస్తుతం సామ్ సిటాడెల్ వెబ్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే సామ్ తాజాగా ఓ ఖరీదైన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలోని జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఖరీదైన డూప్లెక్స్ ప్లాట్‌ను సమంత కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ డ్యూప్లెక్స్ ప్లాట్ 13,14వ ఫ్లోర్లలో ఉందని తెలుస్తుంది. ఇక దీని ధర రూ. 7.8 కోట్లని సమాచారం. ఇక ఇప్పటికే సామ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో వంద కోట్లు విలువ చేసే ఓ ఇల్లు కూడా ఉందని టాక్. ఇక ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ముంబైలో ఓ లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.