బాలీవుడ్ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, కేంద్ర సెన్సార్ బోర్డ్ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ (76) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హిందీ సినీరంగంలో సుదీర్ఘ కాలం కొనసాగిన ఆయన పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. పాప్ కి దునియా, మిట్టి ఔర్ సోనా, షోలా ఔర్ షబ్నమ్, ఆంఖేన్, అందాజ్, తలాష్, రంగీలా రాజా, జూలీ-2 వంటి చిత్రాలు ఆయనకు నిర్మాతగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
2015 నుంచి 2017 వరకు ఆయన కేంద్ర సెన్సార్ బోర్డ్ ఛైర్మన్గా సేవలందించారు. ఈ సమయంలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. పహ్లాజ్ నిహలానీకి భార్య నీతా, ముగ్గురు కుమారులు విశాల్, దీపేశ్, చిరాగ్ ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖుల సంతాపం తెలిపారు.