టాలీవుడ్ (Tollywood) యాక్టర్ ఆకాశ్‌పూరీ (Akash Puri) నటిస్తోన్న తాజా చిత్రం ‘రొమాంటిక్’ (Romantic). అనిల్ పాడూరి (Anil Paduri) దర్శకత్వం వహిస్తుండగా..డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కథ, కథనం, సంభాషణలు సమకూరుస్తున్నారు. ముంబై బ్యూటీ కేతిక శర్మ (Ketika Sharma) ఆకాశ్‌కు జోడీగా నటిస్తోంది. ఇవాళ ఈ చిత్ర ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లాంఛ్ చేశాడు.
‘రొమాంటిక్’ కోరస్ మ్యూజిక్‌తో షురూ అయింది ట్రైలర్. ఐ లైక్ దిస్ ఎనిమల్ అంటూ ఆకాశ్‌పూరీ చెప్తున్న డైలాగ్ కొత్తగా ఉంది. నీలాంటి వాడు కూడా ప్రేమిస్తాడని నేను ఊహించలేదని..పోలీసాఫీసర్ రమ్యకృష్ణ అంటుండగా..నేనింకా లవ్ దాకా పోలేదు మేడమ్ అంటూ ఆకాశ్‌పూరీ చెప్తున్నాడు. ఆకాశ్, కేతిక మధ్య ఎఫైర్ నేపథ్యంలో రొమాంటిక్ చిత్రం సాగనున్నట్టు ట్రైలర్‌తో తెలిసిపోతుంది. కేతికశర్మ తన అందచందాలతో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది.
ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీలో మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును పూరీజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
Fall Madly in Love with our #Romantic Trailer🤩
— Charmme Kaur (@Charmmeofficial) October 19, 2021
Unveiled by PAN INDIA🌟#Prabhas😎
👉https://t.co/cR0ly9pFJT
Be a Part of this LOVE TALE in Theatres From OCT 29th💖@ActorAkashPuri #KetikaSharma #Purijagannadh @Charmmeofficial #Anilpaduri #SunilKashyap @PuriConnects #PCfilm pic.twitter.com/s6Jc8uhzWW
ఇది కూడా చూడండి
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి