పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు యావత్ సినీ ప్రపంచం మద్దతుగా నిలుస్తున్నది. ఉగ్రదాడికి సరైన సమాధానమిదని సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యం పోరాటపటిమను కొనియాడుతూ ‘జై హింద్’ ‘భారత్ మాతాకీ జై’ హ్యాష్‌టాగ్‌లతో పలువురు సినీ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. భారత సైన్యం దేశం గర్వపడేలా చేసిందని, నిజమైన హీరోలకు సెల్యూట్ అంటూ సైనిక చర్యను అభినందిస్తున్నారు.
‘ఈ పోరాటం ఇప్పుడే మొదలైంది. లక్ష్యం పూర్తయ్యే వరకు ఆగదు. దేశం మొత్తం సైన్యానికి తోడుగా ఉంది’
‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలి. జై హింద్’
‘భారతీయులు సిందూరాన్ని తిలకంగా మాత్రమే కాదు…అంతులేని సంకల్ప బలానికి ప్రతీకలా ఉపయోగిస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా గతంలో కంటే బలంగా ముందుకొస్తాం. త్రివిధ దళాల్లోని ప్రతి సైనికుడికి నా వందనాలు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తున్నది’
‘భారత సైన్యాన్ని చూసి దేశం మొత్తం గర్విస్తున్నది. ఉగ్ర చర్యలు భారతీయుల సంకల్పబలాన్ని దెబ్బతీయలేవు. భారత ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక సైనిక చర్యను అభినందిస్తున్నా’
“ఆపరేషన్ సిందూర్’ దేశ ప్రజల్లో స్ఫూర్తినింపింది. త్రివిధ దళాల ధైర్యానికి హ్యాట్సాఫ్. మేమంతా మీ వెంటే ఉన్నాం’
‘ఈ రోజు న్యాయం గెలిచింది. జైహింద్’
‘ధర్మం సైనికుల రూపంలో పోరాడుతున్నది. దేశం మొత్తం మీతోనే ఉంది. సైనికులకు వందనాలు’
“ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యం విజయం సాధించాలని, వారు క్షేమంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. జైహింద్’
‘మేం నిబద్ధతతో ఉంటాం. ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో భారత సైన్యం ఎంతో సంయమనం పాటించింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా మాత్రమే ఈ చర్యలు చేపట్టింది’
‘ఎలాంటి దాడులు, ఉగ్రవాదం లేకుండా ప్రజలు ప్రశాంతంగా గడిపే రోజులు రావాలని కోరుకుంటున్నా. ప్రజల భద్రత కోసం దేవున్ని ప్రార్థిద్దాం. భవిష్యత్తుపై ఆశతో సుసంపన్నంగా అందరూ జీవించాలి. జై హింద్’
‘ఈ దేశంలో ఉగ్రవాదానికి చోటు లేదు. ఇక ఎవరినీ ఉపేక్షించబోం. ఈ చర్యతో పహల్గాం మృతులకు న్యాయం జరిగింది’
‘జై హింద్. ఆపరేషన్ సిందూర్’
‘ఇదీ భారత సైన్యం సత్తా. జైహింద్’
‘దేశంకోసం పోరాడుతున్న రియల్ హీరోలకు సెల్యూట్. మనకోసం సైన్యం ఏం చేయగలదో ఈ ఆపరేషన్‌తో నిజమైంది. దేశం గర్వపడేలా చేశారు’
‘మనమంతా భారత్సైన్యం వెంటే ఉందాం. జై హింద్, జై మహాకాళి’
‘భారత సైన్యం అద్భుతమైన కచ్చితత్వంతో ఆపరేషన్‌ను చేపట్టింది. మన రక్షణకు ఆర్మీ అహర్నిశలు శ్రమిస్తున్నది. మనం వారిని రక్షించుకుందాం’
‘మరోమారు తీవ్రవాద ఘటనలు పునరావృతం కావొద్దు. ఇండియన్ ఆర్మీకి మనందరం మద్దతుగా నిలుద్దాం. ఈ తరుణంలో దేశం మొత్తం ఒక్కతాటిపై నిలిచి సంకల్పబలాన్ని చాటుదాం’