Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులని మట్టుబెట్టారు. అయితే ఎంతో పవిత్రమైన సిందూరం దూరం చూసిన వారిని వేటాడే మిషన్కి “ఆపరేషన్ సిందూర్” అని పెట్టడమే సరైందని ప్రధాని నరేంద్ర మోదీనే సూచించినట్లు తెలుస్తోంది. మన అక్కాచెళ్లెమ్మల నుదుటిన సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. అయితే దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పేరుతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ టైటిల్ కోసం ఏకంగా 15 స్టూడియోల మధ్య యుద్ధం జరుగున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ పేరు దేశవ్యాప్తంగా భావోద్వేగాన్ని రేకెత్తించగా, సినిమా నిర్మాతలు దీనిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
టైటిల్ కోసం పలు నిర్మాణసంస్థలు పోటీ పడుతున్న సమయంలో ఆపరేషన్ సిందూర్ టైటిల్ తో మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందుకు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. ఉత్తమ్ నితిన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. పోస్టర్ లో ఓ మహిళను చూపించారు. సైనిక యూనిఫామ్ వేసుకుని.. రైఫిల్ పట్టుకుని.. నుదుటున సింధూరం పెట్టుకుని ఆమె కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఫైటర్ జెట్స్ తో పాటు యుద్ధభూమిని కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే యుద్ధ వాతావరణం సమయంలో టైటిల్, పోస్టర్ రివీల్ చేయడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరి క్షమాపణలు తెలియజేశాడు.
ఎవరి మనోభావాలని తీసే ఉద్దేశం నాకు లేదు. డబ్బు లేదా ఫేమ్ కోసం నేను ఇలా చేయలేదు. మన సైనికుల ధైర్య సాహసాలని, త్యాగాన్ని , నాయకత్వాన్ని పవర్ ఫుల్ కథగా వెండితెరపైన తీసుకురావాలని అనుకున్నాను. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేసేందుకు ఈ మూవీని రూపొందించాలని అనుకున్నాను. సమయం, సున్నితత్వం కొందరికి అసౌకర్యం కలిగించి ఉంటుంది. కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, దేశ ప్రజల ఎమోషనల్ అని ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.