రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో రూపొందిన న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అపరేషన్ రావణ్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రానికి వెంకటసత్య దర్శకుడు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నదని, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. చరణ్‌రాజ్, విద్యాసాగర్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కె.ఏ.పాల్ రాము, టీవీ5 మూర్తి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ లోహిత్ పూజారి, కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: శరవణ వాసుదేవన్.